అరుణాచల గిరి ప్రదక్షిణలో తెలంగాణ వ్యక్తి హత్య

.భారత్ న్యూస్ హైదరాబాద్….అరుణాచల గిరి ప్రదక్షిణలో తెలంగాణ వ్యక్తి హత్య

అరుణాచల గిరి ప్రదక్షిణలో తెలంగాణకు చెందిన ఓ భక్తుడు హత్యకు గురయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురానికి చెందిన విద్యాసాగర్‌ (32) శుక్రవారం వేకువజామున గిరి ప్రదక్షిణకు వెళ్లారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అతన్ని ఢీకొట్టారు. ప్రశ్నించిన విద్యాసాగర్‌పై యువకులు కత్తితో దాడి చేసి పారిపోయారు. ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.