మైనర్ బాలిక కిడ్నాప్ :ఇద్దరిపై ఫోక్సో కేసు నమోదు

భారత్ న్యూస్ విజయవాడ…మైనర్ బాలిక కిడ్నాప్ :ఇద్దరిపై ఫోక్సో కేసు నమోదు

కృత్తివెన్ను :

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడి తో పాటు అతనికి సహకరించిన మరో యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు ఆదివారం తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఇద్దరినీ రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. 18 ఏళ్లలోపు బాలికలను ప్రేమ పేరుతో వేధించే ఈవ్ టీజర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు….