భారత్ న్యూస్ రాజమండ్రి…బంగారం దొంగతనాన్ని చేదించిన కాకినాడ జిల్లా పోలీసులు – ₹60 లక్షల విలువైన 624 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.
కాకినాడ జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ది.10.09.2025 వ తేదిన తాళ్ళూరు హనీ ధాబా వద్ద ఆగి ఉన్న బస్సులో గల బ్యాగ్ లో బంగారం దొంగిలించిన విషయంపై నమోదు చేసిన కేసును చేదించిన కాకినాడ జిల్లా పోలిసులు.
సుమారు ₹60,00,000/ – విలువైన 624 గ్రాముల బంగారంతో ఉన్న బ్యాగ్ గండేపల్లి మండలం, తాళ్ళూరు హనీ ధాబా వద్ద బోజనానికి దిగిన సమయంలో చోరికి గురి అవ్వడం జరిగింది.

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్., గారి పర్యవేక్షణ లో పెద్దాపురం ఎస్పీఓ శ్రీ శ్రీహరి రాజు గారి ఆధ్వర్యంలో జగ్గంపేట CI శ్రీ వైఆర్కే శ్రీనివాస్, SI గండేపల్లి UV శివ నాగబాబు, ఎస్ఐ కిర్లంపూడి జి సతీష్ మరియు పిఎస్ఐ ఎం రాజా లు మూడు టీమ్స్‌గా ఏర్పడి ఈ కేసును చేధించడం జరిగింది. ఈ కేసులో విజయనగరం కు చెందిన ముగ్గరు పాత ముద్దాయిలను టి నరసింహ, పి తేజ, మహిందర్లను అరెస్ట్ చేసి చోరి సొత్తు మొత్తం 624 గ్రాముల (5 జతలు బంగారు గాజులు, 44 జంట చెవిలిలు మొత్తం విలువ ₹60,00,000/) బంగారు ఆభరణాలను స్వాదినం చేయడం జరిగింది.