స్టైపెండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల (SCTPC) 9 నెలల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన… తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారు.

BHARATH NEWS DIGTAL GODAVARI DISTRICT.*

స్టైపెండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల (SCTPC) 9 నెలల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన… తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారు.

జీవితంలో ఒక నూతన అధ్యయనాన్ని ప్రారంభించిన సందర్భంగా 141 కాండిడేట్స్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఈ శిక్షణా కాలాన్ని చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో పూర్తి చేసుకోవాలి.

ప్రతి ఒక్కరూ హెల్పింగ్ నేచర్ను అలవర్చుకోవాలి.

పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే 30 సంవత్సరాలు మీరు రాష్ట్రానికి సేవ చెయ్యాలి.

…తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి 4th బెటాలియన్ కమాండెంట్ శ్రీ పి. సత్తిబాబు గారు మరియు ఇతర పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికినారు.

అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి స్టైపెండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల (SCTPC) 9 నెలల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల ను ఉద్దేశించి మాట్లాడుతూ… మీరందరూ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం గర్వ కారణమని, 9 నెలల పాటు సాగే ట్రైనింగ్ ను ఎంజాయ్ చేస్తూ, ఎటువంటి నెగిటివ్ థింకింగ్ లేకుండా క్రమశిక్షణతో పూర్తి చేయాలని అన్నారు. దుర అలవాట్ల జోలికి పోవద్దని, సమాజంలో ఉన్న కష్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని, వాటి పట్ల మానవత్వంతో స్పందించి సహాయం చేయాలని సూచించారు. నక్సలైజాన్ని పూర్తిగా రూపుమాపడంలో ఏపీఎస్పీ(APSP) పాత్ర కీలకం అన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల గురించి, డిపార్ట్మెంట్లో తన అనుభవాలను గురించి జిల్లా ఎస్పీ గారు వివరించారు.

ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ గారు మాట్లాడుతూ…పోలీస్ శిక్షణ అనేది కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా, నైతికంగా బాధ్యతాయుతమైన పోలీస్ సిబ్బందిని తయారు చేసే ప్రక్రియ అని పేర్కొన్నారు. శిక్షణార్థులకు శిక్షణా కేంద్రంలో సురక్షితమైన, క్రమబద్ధమైన, ప్రేరణాత్మక వాతావరణం కల్పించామని అన్నారు. మీ 9 నెలలు శిక్షణ అనంతరం పరీక్షల్లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే పోలీస్ కానిస్టేబుల్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం 4th బెటాలియన్ కి ట్రైనింగ్ నిమిత్తం వచ్చిన 141 మందిని ఉత్తమ పోలీస్ కానిస్టేబుళ్లుగా తీర్చిదిద్దుతామని మరియు సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంలో, సైబర్ నేరాలు అరికట్టడంలో మెరుగైన శిక్షణను అందిస్తామని ఈ శిక్షణా కేంద్ర ప్రిన్సిపాల్ గా హామీ ఇస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ యల్. చెంచి రెడ్డి గారు, ట్రైనింగ్ అడిషనల్ కమాండెంట్ (I/c) శ్రీ వి.వి. వి. సత్యనారాయణ గారు, అసిస్టెంట్ కమాండెంట్ ట్రైనింగ్ శ్రీ టి. నాగ శ్రీనివాస్ గారు, ఆర్ ఐ శ్రీ కె. నరసింహారావు గారు, ఆర్ ఐ (యూనిట్ లైసెనింగ్ ఆఫీసర్) శ్రీ జల్లు శ్రీనివాసరావు గారు, ఇన్స్పెక్టర్ (బొమ్మూరు) శ్రీ కాశి విశ్వనాథం గారు, ఇన్స్పెక్టర్ (డి టి సి) శ్రీ ఆర్ సుబ్రహ్మణ్యేశ్వర రావు గారు, ఇతర ఆర్ ఐ లు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.