భారత్ న్యూస్ అనంతపురం…చిత్తూరు జిల్లా పోలీసు
చిత్తూరు పట్టణము నందు ట్రేడింగ్ పేరుతో 27,21,499 రూపాయలు పోగొట్టుకున్న ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు.*
ఫిర్యాదు అందిన వెంటనే ముద్దాయి అకౌంట్ ను ఫ్రీజ్ చేసిన పోలీసులు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామని అంటే నమ్మకండి… సైబర్ మోసగాళ్ల బారిన పడకండి.
“అజ్ఞాత లాభాల మాటలకు లోనై నష్టపోవద్దు — అప్రమత్తంగా ఉండండి, మోసాలనుండి రక్షించుకోండి.” – చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ నెట్టికంటయ్య.*
కేసు వివరాలు:*
13.06.2025న చిత్తూరు పట్టణము నందు నివసించే ఒక వ్యక్తికి, ఒక అపరిచిత వ్యక్తి తాను Pintrex Trading Private Ltd కంపెనీలో ఉద్యోగిగా ఉన్నానని పరిచయం చేసుకుని, ఫిర్యాదుదారునికి ఫోన్ ద్వారా సంప్రదించి, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని మోసపూరితంగా నమ్మబలికి, మొదటగా రూ.21,499/- మొత్తాన్ని ఫిర్యాదుదారుడు తన స్నేహితుడు యొక్క ఫోన్‌పే ద్వారా బదిలీ చేశాడు.
తర్వాత ఫిర్యాదుదారుని పేరుతో ఒక యూసర్ ఐ.డి తో ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసి, ఆ తరువాత కూడా సైబర్ మోసగాడు నిరంతరం ఫోన్ ద్వారా సంప్రదిస్తూ, పెద్ద మొత్తాల లావాదేవీలు
