భారత్ న్యూస్ తిరుపతి…Ammiraju Udaya Shankar.sharma News Editor….గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర
ముఠా అరెస్ట్
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు మరియు అదనపు ఎస్పీ రవిమనోహర్ ఆచారి ఆదేశాల మేరకు, అలాగే శ్రీకాళహస్తి డిఎస్సీ నరసింహమూర్తి పర్యవేక్షణలో, 26-05-2025 న సాయంత్రం 06 గంటల సమయంలో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి. నాగార్జున రెడ్డి కి వచ్చిన గంజాయి రవాణా సంబంధిత సమాచారం ఆధారంగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రం, అంబత్తూరు ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులు శ్రీకాళహస్తి ఎంజిఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద, చెన్నై వెళ్ళే బస్ కోసం ఎదురు చూస్తుండగా, వారిని పట్టుకున్నారు.
