భారత్ న్యూస్ రాజమండ్రి ….అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి సూచనలు
విషయం : వినాయక చవితి
ఉత్సవం
జరుపుకొనుటకు అనుమతి ఉత్తర్వులు.
నిబంధనలు :
1) మండపం ఏర్పాటు గురించి పోలీసు వారి అనుమతి పొందవలెను.
2) విగ్రహం ఎత్తు 12 అడుగులు మించరాదు.
3) గ్రామంలో ప్రజానీకానికి ఇబ్బందికరం కానటువంటి ప్రదేశంలో గణేష్ మండపం ఏర్పాటు చేసుకోవాలి.
4) విద్యుత్ అలంకరణ చేయుట గురించి విద్యుత్ శాఖవారి అనుమతి పొందాలి.
5) గణేష్ మండపం ఉన్నన్ని రోజుల పాటు మండపం నిర్వహించే వారు రాత్రి సమయాల్లో విధిగా ఒక్కరుగాని, ఇద్దరు గాని హాజరులో ఉండాలి.
6) గణేష్ మండపం వద్ద ఏదైనా సాంస్కృతిక కార్యక్రామాలు నిర్వహించుటకు పోలీసు అధికారుల నుండి అనుమతి పొందవలెను.
7) గణేష్ మండపం వద్ద ఉదయం గం||9.00ల నుండి రాత్రి 10గం||ల వరకు మాత్రమే పూజలు /భజనలు / మైకులు వినియోగించాలి.
8) గణేష్ మండపం వద్ద జరిగే అన్ని కార్యకలాపాలకు నిర్వాహకులే బాధ్యత వహించవలసి ఉంటుంది.
9) గణేష్ మండపం వద్ద ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే పోలీసు వారు ఇచ్చిన మండపం అనుమతిని రద్దు చేసి అవసరమైతే చట్టరీత్యా చర్య తీసుకొనబడుతుంది.
10) మండపాల వద్ద / సాంస్కృతిక కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల జెండాలు, హీరోల ఫోటోలు, ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు ఉండరాదు.
11) ఏ మండపం వద్ద కులాల గురించి, మతాల గురించి ఎటువంటి చెడు ప్రస్తావన ఉండరాదు.
12) నిర్వాహకులు మొదటగా తమ అనుమతిలో తెలిపిన నిమజ్జన తేదీన నిమజ్జనం జరిగేలా చూచుకోవాలి.
13) నిమజ్జనం రోజున గ్రామం నుండి త్వరగా బయలుదేరి సాయంత్రం 6గం||ల లోపు నిమజ్జనం పూర్తి చేయాల్సిన బాధ్యత నిర్వహకాలపై ఉన్నది.
14) నిమజ్జనం జరిగే రోజున అనుమతి పొందిన దారిలోనే నిమజ్జన యాత్ర ఉండాలి. అలా కానిచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటాం.
15) మండపాల వద్ద భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
16) అన్ని మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేసి, జాగ్రత్తలు పాటించాలి.
17) నిమజ్జనం సందర్భంగా మధ్యపానీయాలు సేవించి నిమజ్జనంలో పాల్గొనరాదు.
18) ప్రక్కప్రక్కనే మండపాలు ఏర్పాటు చేయరాదు. మండపానికి, మండపానికి దూరాన్ని పాటించాలి.
19) మండపాలకు సమీపంలో ఉన్న చర్చీలకు, మశీదులకు ప్రార్ధన సమయములలో వారికి ఆటంకం కలిగించకుండా ఉండాలి.
20) పై నిబందాలను పాటిస్తూ రిజిస్ట్రేషన్ కొరకు ganeshutsav.net నందు NOC తప్పనిసరిగా తీసుకోవలెను.

DSP, Avanigadda
:9440796406
Avanigadda Circle Inspector
:9440796466