భారత్ న్యూస్ రాజమండ్రి..గంజాయి బదులు ట్యాబ్లెట్స్
కొత్త పుంతలు తొక్కుతున్న డ్రగ్ మాఫియా
అనుమతి లేకుండా విక్రయిస్తున్న రెండు దుకాణాల లైసెన్స్ సస్పెన్షన్
గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో గంజాయికి బదులు ట్యాబ్లెట్స్‌కు వ్యసనపరులు అలవాటుపడుతున్నారు. టాపెంటాడోల్ అనే ట్యాబ్‌లెట్స్ గోవా నుంచి గుంటూరుకు దిగుమతి అవుతున్నాయి. ఈ టాబ్లెట్స్ అక్రమ వినియోగంపై జిల్లా పోలీసు అధికారులు ఔషధ నియంత్రణ శాఖ దృష్టికి తీసుకువెళ్ళారు. వైద్యుల పిస్క్రిప్షన్ లేకుండా ఈ టాబ్లెట్లు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో నగరంలోని పలు అనుమానిత దుకాణాలపై దాడులు చేశారు. రెండు దుకాణాలను గుర్తించి వాటి లైసెన్సును ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు.
ఈ ట్యాబెట్లు ఒక షీటు రూ.మూడు వేలుగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ట్యాబ్లెట్లను నీటిలో కరిగించుకొని సిరంజీ ద్వారా శరీరంలోకి ఎక్కించుకుంటారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఈ తరహా ట్యాబెట్లు విక్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్ తెలిపారు. ఈ అంశాన్ని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌క
