భారత్ న్యూస్ డిజిటల్:సిద్దిపేట:
28 డిసెంబర్, 2025
సిద్ధిపేట పట్టణంలో గాలిపటాల దుకాణాల్లో పోలీసుల తనిఖీలు: నిషేధిత ‘చైనా మాంజా’ విక్రయిస్తే కఠిన చర్యలు
ఈరోజు సిద్ధిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు పట్టణంలోని వివిధ గాలిపటాలు మరియు మాంజా విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

- దుకాణదారులు ఎవరూ కూడా నిషేధిత చైనా మాంజాను విక్రయించకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి విక్రయాలు జరిపితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
- పశువులు , పక్షులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని, అలాగే వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని, ఇలాంటి సంఘటనలు జరగకుండా పట్టణంలో వ్యాపారులు మాంజా ధారాలను విక్రయించరాదని సూచించారు.
- ఈ దారం విద్యుత్ తీగలకు తగిలితే షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. చైనా మాంజా వాడకం మరియు విక్రయం చట్టరీత్యా నేరం. దీనివల్ల జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజల భద్రతకు అనుకూలమైన సాధారణ పత్తి దారాన్ని మాత్రమే ఉపయోగించాలని కోరడమైనది. ప్రజలందరూ పోలీసులకు సహకరించి సురక్షితంగా పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశాడమైనది.