భారత్ న్యూస్ అనంతపురం…భామిని మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
పార్వతీపురం మన్యం జిల్లా :
పాలకొండ నియోజకవర్గం :
భామిని మండలం :

పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం లోని బత్తిలి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుండి ఒరిస్సాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యం లోని బృందం పక్కా సమాచారంతో పట్టుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఈ టీంలో డీఎస్పీతో పాటు పాలకొండ సీఐ, బత్తిలి ఎస్సై అప్పారావులు ఉన్నారు.