భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.హైదరాబాద్‌లో జింక మాంసం అక్రమ విక్రయం – నిందితుడి అరెస్ట్
రాజేంద్రనగర్ SOT పోలీసులు జింక మాంసాన్ని అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టైన నిందితుడిని మహమ్మద్ ఇర్ఫానుద్దీన్ (Mohammad Irfanuddin) గాగుర్తించారు.
అతడు సులేమాన్ నగర్ (SulemanNagar) కు చెందినవాడిగా పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి…
- 15 కిలోల జింక మాంసంతో పాటు
- నగదును స్వాధీనం చేసుకున్నారు.
- అడవిలో జింకను వేటాడి, దాని మాంసాన్ని సులేమాన్ నగర్లో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

నమ్మదగిన సమాచారంతో SOT పోలీసులు దాడులు నిర్వహించగా నిందితుడు పట్టుబడ్డాడు.
ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.