హైదరాబాద్ డ్రగ్ టెస్ట్ డ్రైవ్: 189 మంది పాజిటివ్

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ డ్రగ్ టెస్ట్ డ్రైవ్: 189 మంది పాజిటివ్

హైదరాబాద్ సిటీ పోలీసులు ఏప్రిల్ 9న రౌడీ షీటర్లు మరియు NDPS కేసులలో ఉన్న వారిపై ఆకస్మిక డ్రగ్ టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 239 మందికి పరీక్షలు నిర్వహించారు.

వారిలో 189 మంది డ్రగ్స్ వినియోగం చేసినట్లు తేలింది. ఈ డ్రైవ్ ద్వారా డ్రగ్ దుర్వినియోగంపై అవగాహన కల్పించడం లక్ష్యమని అధికారులు తెలిపారు.

పాజిటివ్‌గా వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.