భారత్ న్యూస్ రాజమండ్రి ….ఇంటి దొంగలను పట్టుకున్న ఈశ్వరరావు
కేసును వారంలో ఛేదించిన పోలీసులు
చల్లవల్లి పోలీసలుకు రివార్డులు, ప్రశంసలు వెల్లువ
చల్లపల్లి:
పక్కింటి వారితో పాటు సొంత బంధువుల ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్న ఇంటి దొంగలను చల్లపల్లి సిఐ కె ఈశ్వరరావు పట్టుకున్నారు. ఈశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడు తోడైనట్లు సిఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై సుబ్రహ్మణ్యం బృందం దొంగతనం జరిగిన వారం రోజుల్లోనే నేరస్థులను పట్టుకుని వారి వద్ద నుంచి నగలు, వెండి వస్తువులను స్వాధీనపరుచుకోవ టంలో కీలక పాత్ర పోషించారు. చల్లపల్లి పోలీసులను ఎస్పీ ఆర్.గంగాధరరావు, అవనిగడ్డ డి.ఎస్.పి తాళ్లూరి విద్యశ్రీలు అభినందించి ప్రశంసలు కురిపించడంతోపాటు వారికి నగదు రివార్డులు అందజేశారు. ఈ మధ్యకాలంలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ఆభరణాలు పట్టుకున్న కేసు ఇదే కావటం గమనార్హం.
ఈనెల 28వ తేదీన చల్లపల్లి నారాయణరావునగర్లో నర్రా ప్రభావతి ఇంటి తాళాలు బయట గ్రైండర్లో పెట్టి గుడికి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలోని 158 గ్రాముల నగదు, ఒక కేజీ వెండి వస్తువులు కనిపించకపోవటంతో అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీఐ కె.ఈశ్వరరావు తనదైన కోణంలో విచారణ చేపట్టారు. ఎస్ఐ పిఎస్వి నుబ్రహ్మణ్యం, ట్రైని ఎస్ఐ శ్రీలత, వీసీలు శివాజి, మనోహర్లతో కూడిన బృందాన్ని రంగంలోకి దించారు. ప్రభావతి ఇంటి వక్కన ఉంటున్న షేక్ రహంతున్నీసా, నజిబుల్లా దంవతులపై అనుమానం రావటంతో లోతుగా విచారణ జరిపారు. దీంతో తీగలాగితే డొండ కదిలినట్లు ఈ దొంగతనంతోపాటు గతంలో పెడనలో 204 గ్రాములు, పెనమలూరులో 254 గ్రాములు చోరీలు బయటకు లాగారు. ఇవన్నీ తామే చేసినట్లు అన్నీ బయటపెట్టడంతో వారిని మంగళవారం ఎస్పి ఎదుట ప్రవేశపెట్టారు. అతి తక్కువ నమయంలో దొంగలను పట్టుకోవటంతోపాటు సవాలుగా మారిన పెనమలూరు, పెడనలో చోరీకి గురైన నగలు, వెండి వస్తువులను కూడా రికవరీచేసినందుకు చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు, ఎస్ఐ పిఎస్వి సుబ్రహ్మణ్యం, ట్రైనీ ఎస్ఐ శ్రీలత, పిసి సిహెచ్ శివాజి, ఈ.మనోహర్, మోపిదేవి ఎస్ఐ వైవివి సత్యనారాయణలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో కేసును ఛేదించిన చల్లపల్లి పోలీసులపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
