హోం మంత్రి అనిత వంగలపూడి ఇప్పటికే ఫోన్‌లో కానిస్టేబుల్ జయశాంతిని అభినందించి,

భారత్ న్యూస్ గుంటూరు….రెండు రోజుల క్రితం, రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి , తూర్పు గోదావరి జిల్లాలో డ్యూటీ లో లేకపోయినా తన బిడ్డను తీసుకెళ్తూ ట్రాఫిక్‌ను అదుపు లోకి తెచ్చేందుకు సహాయ పడింది.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత వంగలపూడి ఇప్పటికే ఫోన్‌లో కానిస్టేబుల్ జయశాంతిని అభినందించి, తనను పర్సనల్‌గా కలవాలని చెప్పారు.
ఈ రోజు, కానిస్టేబుల్ జయశాంతి తన కుటుంబంతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో హోం మంత్రిని కలిశారు.
మంత్రి అనిత కానిస్టేబుల్‌కు, భర్తకు బట్టలు ఇచ్చి సత్కరించారు మరియు వారితో కలిసి భోజనం చేశారు.