.పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా చోటుచేసుకుంది..

.భారత్ న్యూస్ హైదరాబాద్….పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా చోటుచేసుకుంది..

సింగర్ మంగ్లీ కేసుకు సంబంధించి బాధితులతో కలిసి వచ్చిన ఒక అడ్వకేట్‌ సుబ్బారావు కు పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ చేశారు..

న్యాయవాది మద్యం సేవించి ఉన్నారనే అనుమానంతో బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశామని తెలిపిన పోలీసులు..

టెస్ట్ లో రీడింగ్ 27 పాయింట్లు నమోదైందనీ.. అతను ఆల్కహాల్ సేవించి ఉన్నాడని తెలిపిన పోలీసులు..

అయితే లెక్క ప్రకారం 38 పాయింట్లు ఉండాలని..రాత్రి సేవించిన మద్యం వల్లే అలా వచ్చిందని.. తను ఈరోజు ఎలాంటి మద్యం తీసుకోలేదని.. కావాలనే పోలీసులు ఇలా చేస్తున్నారంటూ వాదనకు దిగిన సుబ్బారావు..

దీంతో పోలీసులకు సుబ్బారావు కు మధ్య కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది…

తాము డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేయలేదని.. కేవలం టెస్ట్ చేసి.. అలా మద్యం సేవించి వాహనం నడపడం తప్పు అని చెప్పామని.. పరిమితికి లోబడి పాయింట్లు నమోదు అయినందున కేవలం ఆయనకు వివరించడానికి ప్రయతించామని.. ఆయనే తమతో వాదనకు దిగాడని అంటున్న పోలీసులు..