ఈ తనిఖీ లలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నటువంటి వారిని గుర్తించి,

భారత్ న్యూస్ డిజిటల్:ఏలూరు:

జంగారెడ్డిగూడెం ASP సుస్మిత ఆర్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలపై జంగారెడ్డి గూడెం పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియమాల పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ రోజు అనగా 04-02- 2026 న జంగారెడ్డి గూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.వి. సుభాష్ గారి యొక్క ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ కుటుంబరావు గారు తమ పోలీస్ సిబ్బంది తో కలిసి ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిం చారు.

👉 ఈ తనిఖీ లలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నటువంటి వారిని గుర్తించి, ఆయా వాహన యజమాను లకు జరిమానాలు విధించకుండా వారి చేత అప్పటికప్పుడు 38 మంది ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించి హెల్మెట్ వలన కలిగే ఎటువంటి ఉపయోగాలను గురించి వారికి తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో రహదారి ప్రమాదాలలో ఎక్కువగా యువత ద్విచక్ర వాహనాలతో ప్రయాణం చేస్తున్న వారు ఎక్కువగా మరణాలకు గురవుతున్నట్లు, హెల్మెట్ ధరించడం వలన సురక్షిత గమ్యస్థానాలకు చేరుకుంటారని హితవు పలికిన జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ.

👉ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు గారు మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

👉 అతి వేగం మరియు నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరిస్తూ
వేగం వద్దు – ప్రాణం ముద్దు అనే నినాదాన్ని ప్రతి వాహనదారు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

👉ట్రాఫిక్ నియమాల ను పాటిస్తూ సురక్షిత ప్రయాణాలు చేయాలని జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు గారు తెలియ చేసినారు.