PGRS కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు…..

భారత్ న్యూస్ గుంటూరు…PGRS కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు…..
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోనీ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (Public Grievances Redressal System – PGRS) కార్యక్రమంలో పాల్గొని జిల్లా ప్రజల నుండి వచ్చిన వివిధ ఫిర్యాదులను స్వీకరించిన గౌరవ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) శ్రీ GV రమణమూర్తి గారు, ఇతర పోలీస్ అధికారులు.
గౌరవ అదనపు ఎస్పీ(అడ్మిన్) గారు మాట్లాడుతూ …
ప్రజల ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి PGRS లో వచ్చిన సదరు సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్ట పరమైన పరిష్కారం చూపాలని సూచించడం జరిగింది.
ప్రజల అర్జీలు పునరావృతం కాకుండా, వచ్చిన ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారించి మొదటిసారే చట్ట పరిధిలో పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.
పోలీసులు తమ సమస్యలను పరిష్కరిస్తారనే భరోసాను బాధితులకు కల్పించే విధంగా అర్జీల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని సూచించడం జరిగింది.
ఈరోజు జరిగిన కార్యక్రమంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాద