భారత్ న్యూస్ అనంతపురం,ఎముకలు కోరికే చలిలో నాలుగు రోజుల పసిపాప
అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లిన వైనం …
ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి : పాపం పసిపాప… భూమ్మీద పుట్టిన మూడు రోజులకే తల్లిదండ్రులకు బరువైందేమో ఆ పసికందుకే మాటలు వస్తే ఎముకలు కోరికే చలిలో రోడ్డు పక్కన నన్ను వదిలి వెళ్ళడానికి చేతులెల వచ్చాయని నిలదీస్తుందేమో… రోడ్డు పక్కన నాలుగు రోజుల పసికందును వదిలేసి వెళ్లిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కాలసముద్రం సమీపంలోని అటవీ అతిధి గృహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు పాప ఏడుపును విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఐసిడిఎస్ సిబ్బంది అక్కడికి చేరుకొని పసికందును కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చిన్న పిల్లల వైద్యులు పరీక్షించి పాప ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు అయితే చిన్నారి ఎడమ చేతికి నాలుగు వేళ్లు లేనట్లు వైద్యులు గుర్తించారు. చిన్నారని వదిలి వెళ్ళడానికి ప్రధాన కారణం ఆ పాప చేతికి నాలుగు వేళ్ళు లేకపోవడం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేక ఆడబిడ్డ అనే వదిలి వెళ్ళారా అన్న మాటలు వినిపిస్తున్నాయి. పై ఐసిడిఎస్ సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు కదిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.