విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను ఛేదించాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

భారత్ న్యూస్ డిజిటల్:ఆదిలాబాద్:

” విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను ఛేదించాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

నేరడిగొండ మండలం లక్కంపూర్ గ్రామం ఆశ్రమ పాఠశాలలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం

హెల్మెట్ లేకుండా ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ ఫోన్ తో డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగంతో డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులను బంధుమిత్రులను ప్రోత్సహించాలని సూచన.

ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా పోలీస్ అక్క, షీ టీం ద్వారా సహాయం పొందవచ్చు అని హామీ

విద్యార్థి దశ నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

“అరైవ్ అలైవ్” లో భాగంగా విద్యార్థినీ విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులను రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా ప్రోత్సహించేందుకు ఈరోజు నేరడిగొండ మండలం లక్కంపూర్ గ్రామం నందు గల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ అవగాహన కల్పించారు. మొదటగా పాఠశాల విద్యార్థినిలు జిల్లా ఎస్పీ కి ఘన స్వాగతం పలికి, సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు హెల్మెట్ లేకుండా ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ ఫోన్ తో డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగంతో డ్రైవింగ్ చేయకుండా వారికి తెలియజేసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థినిలు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని, తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని తెలిపారు. విద్యార్థినిలకు ఎల్లవేళలా ఆదిలాబాద్ షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తుందని వేధింపులకు గురైన పాఠశాలలో కళాశాలలో రోడ్డుపై ఇంటి వద్ద ఎలాంటి ప్రదేశంలోనైనా సమస్యలకు గురైతే వెంటనే ఆదిలాబాద్ షీ టీం 8712659953 ద్వారా సంప్రదించాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ నేర్చుకొని వారి కుటుంబ సభ్యులు పాటించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లా పోలీసు శాఖ తరపున జరుపుతున్న ఈ కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే జిల్లా పోలీసులు శాఖ లక్ష్యంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సిఐ బండారి రాజు, నేరేడికొండ ఎస్సై ఇమ్రాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.