రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్ధుల మృతి !

భారత్ న్యూస్ రాజమండ్రి…రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్ధుల మృతి !

పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. జాతీయ రహదారిపై అనుమానిత కంటైనర్‌ను ఆర్టీవో అధికారులు ఆపే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో కంటైనర్‌ను పట్టుకోవడానికి ఆర్టీవో అధికారులు వారి వాహనాన్నిరోడ్డుకు అడ్డంగా పెట్టారు. దీంతో కంటైనర్ డ్రైవర్ ఆపే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించని విద్యార్థులు కారుతో అత్యంత వేగంతో వచ్చి కంటైనర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే నలుగురు విద్యార్థులు అయ్యప్ప మాలలో ఉన్నారు. రేపు(శనివారం) శబరిమల యాత్ర వెళ్లేందుకు స్వగ్రామాలకు వెళ్తున్ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. విద్యార్థుల మృతితో ఆయా కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.