.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ ఎఫ్‌ఎస్ఎల్‌లో అగ్ని ప్రమాదం; ప్రాణనష్టం లేదు
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో ఫిబ్రవరి 7 ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని టీజీఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖా గోయెల్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని ఆమె స్పష్టం చేశారు.
ఉదయం 10:08 గంటల సమయంలో మొదటి అంతస్తులోని కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పొగలు గుర్తించగా, వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్లు చేరుకొని మధ్యాహ్నం 1:30 గంటల కల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి.

ల్యాబ్‌లు, ట్రైనింగ్ హాల్‌కు కొంత నష్టం జరిగినప్పటికీ, కేసు ఆస్తుల నష్టం లేదని శిఖా గోయెల్ తెలిపారు. అగ్ని ప్రమాద కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోందని ఆమె చెప్పారు.