భారత్ న్యూస్ గుంటూరు ….బతికే ఉన్న అక్క చనిపోయిందని నకిలీ పత్రాలు… ఆస్తుల మోసం బయటపడింది
గుంటూరు జిల్లా తెనాలిలో షాకింగ్ ఘటన. సోదరి బసవ పూర్ణకుమారి బతికే ఉన్నప్పటికీ చనిపోయిందని అబద్ధం చెప్పి, తాము వారసులమని నకిలీ పత్రాలు సృష్టించిన తండ్రీకొడుకులు కోలపల్లి సత్యనారాయణ, నరేష్ రూ.1 కోటి విలువైన భూములు, ఇల్లు రూ.55 లక్షలకు విక్రయం. వారికి తోడ్పడిన డాక్యుమెంట్ రైటర్ తిరుపతి మరియదాస్, మీ-సేవ నిర్వాహకుడు దాసరి శివన్నారాయణతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఇంతకుముందు కూడా మోసం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
