భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో భారీ పేలుడు
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్-1 దగ్గర పార్కింగ్ చేసి ఉన్న కారులో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇద్దరికి గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. బీహార్ ఎన్నికల వేళ ఈ పేలుడు జరగడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
