ఏలూరు 2 టౌన్ పోలీసులు ఏలూరు టూ టౌన్ పరిధిలోని తాపీ మేస్త్రి కాలనీ (7వ రోడ్డు) లో తప్పి పోయిన చిన్నారులను 20 నిమిషాల్లో తల్లి దండ్రులు వద్ద కు చేర్చిన పోలీస్ సిబ్బంది*

భారత్ న్యూస్ డిజిటల్ : అమరావతి:

ఏలూరు 2 టౌన్ పోలీసులు ఏలూరు టూ టౌన్ పరిధిలోని తాపీ మేస్త్రి కాలనీ (7వ రోడ్డు) లో తప్పి పోయిన చిన్నారులను 20 నిమిషాల్లో తల్లి దండ్రులు వద్ద కు చేర్చిన పోలీస్ సిబ్బంది*

డయల్ 112 కాల్‌కు తక్షణమే స్పందించిన డీఎస్పీ మరియు సిబ్బంది ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు.

ఏలూరు 2 టౌన్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను కేవలం 20 నిమిషాల వ్యవధిలో రక్షించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

ఏలూరు టూ టౌన్ పరిధిలోని తాపీ మేస్త్రి కాలనీ (7వ రోడ్డు) లో నివాసం ఉంటున్న నరేష్ మరియు భార్గవి దంపతుల పిల్లలైన బండి హర్షిణి సహస్ర 3 సంవత్సరాలు, తేజీ శ్రీదోస్ 5 సంవత్సరాలు ఆడుకుంటూ బయటకు వెళ్లి మార్గం తప్పారు. పిల్లలు కనిపించక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే ‘112’ అత్యవసర నంబర్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే ఏలూరు డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ మరియు టూ టౌన్ సీఐ శ్రీ కె. అశోక్ కుమార్ గారు అప్రమత్త మయ్యారు.

తక్షణమే మూడు ప్రత్యేక బృందాలను 3 ఏర్పాటు చేసి కాలనీ పరిసరాల్లో గాలింపు చేపట్టారు.

గాలింపులో భాగంగా లంకపేట ఏరియాలో ఒంటరిగా ఉన్న చిన్నారులను పోలీసులు గుర్తించారు. ఆడుకుంటూ దారి తప్పి ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు నిర్ధారించుకున్నారు.

ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే చిన్నారులను సురక్షితంగా వారి ఇంటికి తీసుకువెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు.

తమ పిల్లలను ఇంత త్వరగా వెతికి పెట్టినందుకు బాధితులు నరేష్, భార్గవి కన్నీటి పర్యంతమవుతూ డీఎస్పీ గారికి మరియు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

పిల్లల పట్ల తల్లి దండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఆపద కలిగితే వెంటనే 112 కి సమాచారం అందించాలని ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ గారు సూచించారు.