ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో భారీ దొంగతనం

భారత్ న్యూస్ రాజమండ్రి….ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో భారీ దొంగతనం

వృద్ధులపై దాడి చేసి కట్టేసి బెదిరించి బంగారం ఎత్తుకుపోయిన దొంగలు.

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో ఓ ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

లక్కవరంలో నివాస‌ముంటున్న వందనపు రూక్కయ్య లక్ష్మీ కుమారి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి తెల్లవారుజామున దొంగ‌లు చొర‌బ‌డ్డారు.

ఇంట్లో ఉన్న భారీ ఎత్తులో అభరణాలు క్యాష్ బంగారు ఆభ‌ర‌ణాల‌తో పాటు విలువైన వ‌స్తువుల‌ను దొంగ‌లు ఎత్తుకెళ్లారు.

ఈ చోరీపై లక్కవరం పోలీసుల‌కు బాధితులు అర్ధరాత్రి ఫిర్యాదు చేయడం. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

చోరీ జ‌రిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు..

విషయం తెలుసుకున్న వెంటనే జంగారెడ్డిగూడెం డిఎస్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ తడికలపూడి ఎస్సై సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

మరి కొద్ది సేపట్లో ఏలూరు నుంచి క్లూస్ టీం.. రానుంది..

దొంగతనం చేయడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారని భయబ్రాంతులకు గురి చేశారని బాధితులు చెబుతున్నారు…