నాగయలంక మండలం దిగువ ప్రాంతమైన ఈల చెట్ల దిబ్బ గ్రామం నుంచి 11 సంచార జాతికి చెందిన యానాది కుటుంబాలు విముక్తి,

భారత్ న్యూస్ రాజమండ్రి…అవనిగడ్డ నియోజకవర్గం

నాగయలంక మండలం దిగువ ప్రాంతమైన ఈల చెట్ల దిబ్బ గ్రామం నుంచి 11 సంచార జాతికి చెందిన యానాది కుటుంబాలు విముక్తి,

Ammiraju Udaya Shankar.sharma News Editor…స్వయంగా కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం ఈలా చెట్లదిబ్బ ఊరికి వచ్చి సమస్యని పరిష్కరరించిన అధికారులు.

కేవలం అక్రమ అర్జునే దేంగా వ్యవహరిస్తున్న కొంతమంది చేతుల్లో నుంచి విముక్తి చేసిన సంచర జాతికి చెందిన యానాది కుటుంబాలు,

27 కుటుంబాలు ఇక్కడ నివసిస్తునట్టు అధికారులు నిర్ధారించారు.

వీరిలో 16 కుటుంబాలు ఇక్కడే ఉంటామని చెప్పటం జరిగింది.

విముక్తి పొందిన 11 కుటుంబాలలో 2 కుటుంలు బాపట్ల జిల్లా, బాపట్ల కు చెందిన వారిగా గుర్తింపు.

అవనిగడ్డ డి ఎస్ పి విద్యశ్రీ మాట్లాడుతూ, 27 కుటుంబాలను విచారించడం జరిగింది. వీరిలో 16 కుటుంబాలు ఈలాచెట్లదిబ్బ, లో ఉండటానికి అనుమతించడం జరిగింది. 11 కుటుంబాలను వారి స్వగ్రామానికి పంపించడం జరుగుతుంది. 16 కుటుంబాలు మినహాయించి, సంచార జాతులకు చెందిన వారు ఇక్కడ నివసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డి.ఎస్.పి విద్యశ్రీ అన్నారు.

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఈలచేట్లదిబ్బ, గ్రామంలో అక్రమంగా సంచార జాతికి చెందిన ఎస్టీ యానాది కుటుంబాలను గత కొన్ని సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేస్తున్నారని కలెక్టర్ గారికి ఫిర్యాదు అందడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఒక డిస్టిక్ లెవెల్ కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది. 27 ఎస్టి యానాది కులానికి సంబంధించిన ఫ్యామిలీలను విచారించడం జరిగింది. 16 కుటుంబాలు స్వచ్ఛందంగా మేమే వచ్చి పీతలు వేట చేసుకుంటూ, జీవనాధారం సాగిస్తున్నామని చెప్పడం జరిగింది. 11 కుటుంబాలు విముక్తి పొంది తమ స్వగ్రామాలకు వెళ్లిపోతామని చెప్పడం జరిగింది. అని ఆర్డిఓ అన్నారు.

నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆర్గనేషన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న, కుందా ఉదయ్ కుమార్ ఫిర్యాదు మేరకు, ఈనెల 8 వ తారీకు కొంతమంది జర్నలిస్టుల ద్వారా కొన్ని వీడియోస్ నాకు పంపించడం జరిగింది. నాగాయలంక మండలం ఈలసెట్లదిబ్బ, గ్రామంలో కొంతమంది సంచార జాతులకు సంబంధించిన యానాదులను వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఫిర్యాదు అందడం జరిగింది. తరువాత నేను సోమవారం జిల్లా కలెక్టర్ గారి ముందుకు ఈ ఫిర్యాదును తీసుకురావడం జరిగింది. తరువాత జిల్లా యంత్రాంగాన్ని, ఈలచెట్లదీబ్బ గ్రామానికి పంపించడం జరిగింది. వెట్టి చాకిరి నుండి 11 కుటుంబాలను విముక్తి చేయడం కూడా జరిగింది.

గ్రామస్తులు 40 కుటుంబాలకు పైగా ఉండాల్సిన వారు 27 కుటుంబాలే ఉడటమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఊరి సమస్య ఏమి తీరకుండానే అధికారులు వెళ్లిపోతున్నారని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.