బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా.

భారత్ న్యూస్ డిజిటల్: హైదరాబాద్: బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా.

బెంగళూరు నుంచి హైదరాబాద్ ku డ్రగ్స్ రవాణా అవుతున్నా యని సమాచారం మేరకు ఎస్టిఎఫ్ బి టీం ఎస్సై బాలరాజు సిఐ సిబ్బంది కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు.

శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినటువంటి ఒక క్యాబ్ ఆపి తనిఖీలు నిర్వహించగా అందులో డ్రగ్స్ లభించాయి.

సాయి చరణ్ అనే వ్యక్తి వద్ద 5.39 ఎంబీఏఎం డ్రగ్సు 6 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.

నిందితుడుని డ్రగ్స్ ను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.

ఇదే సమాచారంతో ఎస్వోటీ పోలీసులు కూడా శంషాబాద్ ఏరియాలో తనిఖీలు చేపట్టారు.

కానీ ముందుగా నిందితుడు డ్రగ్స్ తో ఎస్టిఎఫ్ బృందానికి పట్టుబడడం జరిగింది.