భారత్ న్యూస్ హైదరాబాద్….మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు!
అంబర్‌పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కంబాల శంకర్ గారు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడం అత్యంత విచారకరం. పుట్టెడు దుఃఖంలోనూ వారి తండ్రి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది.
శంకర్ గారి అవయవాలను (2 కిడ్నీలు, లివర్) దానం చేయడం ద్వారా ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

శంకర్ గారి కుటుంబ సభ్యుల త్యాగానికి నా సెల్యూట్. మీ ఉదారత మరెందరికో స్ఫూర్తి.