భారత్ న్యూస్ గుంటూరు…..గుంటూరు జిల్లా పోలీస్…
ఈ విధంగా గుంటూరు జిల్లాలో అనధికార బైకు స్టంట్లు, రేసులు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ గారు.
గుంటూరు నగరంలో సాధారణ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తూ, బైకు మీద స్టంట్లు చేస్తున్న యువకునిపై గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, కౌన్సిలింగ్ నిర్వహించిన గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు.
పోలీస్ వారు చర్యల అనంతరం తనకు కనువిప్పు కలిగిందని, తన మాదిరిగా ఎవరూ కూడా బైకు స్టంట్లు, బైకు రేసులు చేసి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని, తల్లిదండ్రులకు చెడ్డ పేరుని, దుఃఖాన్ని తేవద్దని, తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దని తాను చేసిన అనధికార బైకు స్టంట్లకు పశ్చాత్తాపపడుతున్నట్టు వీడియోలో తెలిపిన యువకుడు.
