.భారత్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్‌లో ‘డిజిటల్ అరెస్ట్’ మోసం.. వృద్ధుడిని బెదిరించి రూ.51 లక్షల స్వాహా!
రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.51 లక్షల వసూలు
బాంబు పేలుళ్ల కేసులో ఇరికిస్తామని బెదిరించిన సైబర్ నేరగాళ్లు
వీడియో కాల్ చేసి బాధితుడిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసిన వైనం
నగరంలో ఈ వారంలో ఇది రెండో అతిపెద్ద సైబర్ మోసం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా శ్రీనగర్ కాలనీకి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వీరి వలలో చిక్కి రూ.51 లక్షలు పోగొట్టుకున్నారు.

అసలేం జరిగిందంటే..!
బాధితుడికి కొన్ని రోజుల క్రితం ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీనని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి మొబైల్ సిమ్ కార్డును బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో వాడారని, అతని పేరు మీద ఇతరులు మరికొన్ని సిమ్ కార్డులు తీసుకున్నారని నమ్మబలికాడు. అంతేకాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయంటూ సీబీఐ పేరుతో