భారత్ న్యూస్ మంగళగిరి…ద్విచక్ర వాహనాల నుంచి అధిక శబ్దాలు సహించం: గుడివాడ డి.ఎస్.పి ధీరజ్ వినిల్

A. Udaya Shankar.sharma News Editor…గుడివాడ పట్టణంలో బుల్లెట్ లాంటి ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలు సృష్టిస్తే సహించేది లేదని గుడివాడ డీఎస్పీ వి. ధీరజ్ వినీల్ హెచ్చరిచారు. పట్టణంలో బుల్లెట్ల ద్వారా అత్యధిక శబ్దాలు చేస్తున్న వారి వాహనాల సైలెన్సర్లు తొలగించి వాటిని వన్ టౌన్ పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎస్సై పూడి నాగరాజు, సిబ్బంది తనిఖీలు చేసి దారుణంగా శబ్దాలు వస్తున్న వాహనాలను గుర్తించి.. వాటి సైలెన్సర్లను మెకానిక్ సాయంతో తొలగించినట్లు చెప్పారు. వాహన దారులకు సూచనలు చేసి జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ప్రజలు పరిధికి మించి శబ్దాలను వింటే వారి వినికిడి శక్తి నాశనం అయ్యే అవకాశాలు, గుండె జబ్బుల వారు ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ట్రాఫిక్ ఎస్సై నాగరాజు, ఏఎస్సై శంకర్ సిబ్బంది పాల్గొన్నారు.
