నకిలీ APK ఫైల్ తో సైబర్ నేరాలకు పాల్పడే అంతర రాష్ట్ర ముఠా ను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు-

భారత్ న్యూస్ గుంటూరు…నకిలీ APK ఫైల్ తో సైబర్ నేరాలకు పాల్పడే అంతర రాష్ట్ర ముఠా ను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు-
జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు

 సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. APK ఫైల్స్ క్లిక్ చెయ్యవద్దు-జిల్లా యస్.పి. గారు
 కొత్త వ్యక్తులు, నంబర్ల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్, వెబ్ సైట్స్ లింకులు తెరవవద్దన్నారు. టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మవద్దని సూచించారు.
 RTO ఈ చలానా APK ఫైల్ పంపి, కొత్త పంథాలో నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు.
 అమాయక ప్రజలే లక్ష్యంగా వల వేస్తున్న ముద్దాయిలు.. దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు.. తస్మాత్ జాగ్రత్త.
 జల్సాలకు అలవాటుపడి నగదు కోసం ముఠాగా ఏర్పడి సైబర్ నేరానికి పాల్పడుతున్న ముద్దాయిలందరూ యువతే.
 కావలి పరిధిలో ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన కావలి 1 టౌన్ పోలీసులు సైబర్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో ముగ్గురు అంతర రాష్ట్ర ముద్దాయిలను
 జార్ఖండ్ రాష్ట్రంలోని సైబర్ నేరాలకు అడ్డాగా ఉన్న జాంతారా జిల్లాలో అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 21.90 లక్షల నగదు రికవరీ చేసి, Rs.1,23,855/- ను అకౌంట్ నందు ఫ్రీజ్ చేయడం జరిగింది.
 ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో ఫ్రాడ్ జరిగినట్టు అయితే వెంటనే నిర్బయంగా వచ్చి పోలీసు వారిని ఆశ్రయించాలని, ఆందోళన చెంద కుండా సకాలంలో స్పందిస్తే పూర్తి న్యాయం జరుగుతుంది.
 మోసం జరిగిన వెంటనే http://cybercrime.gov.in/ కు లేదా 1930 లేదా దగ్గరలోని పోలీస్ వారికి పిర్యాదు చేయాలని విన్నపం.
 చాకచక్యంగా ముద్దాయిలను అరెస్ట్ చేసిన కావలి 1 టౌన్ మరియు సైబర్ పోలీసు సిబ్బంది, అధికారులను అభినందించిన జిల్లా యస్.పి. గారు
కేసు వివరాలు: Cr.No.184/2025 U/S 303(2), 319(2) BNS & 66(C), 66(D) IT చట్టం, 2000 of Kavali 1 town PS
ముద్దాయిల వివరాలు: A1. వివేక్ కుమార్ మండల్ తండ్రి ప్రదీప్ మండల్, వయస్సు 25 సంవత్సరాలు, తేతుల్‌బండ గ్రామం, కర్మతార్ పోస్ట్, జాంతారా జిల్లా, జార్ఖండ్ రాష్ట్రం.
A2- రాకేష్ కుమార్ మండల్, S/o లేట్ సంఫుల్, వయస్సు 24 సంవత్సరాలు, హేత్ కర్మాటర్ గ్రామం, జాంతారా జిల్లా, జార్ఖండ్ రాష్ట్రం
A3- సంజయ్ మండల్, S/o బిధేషి మండల్, వయస్సు 24 సంవత్సరాలు, హేత్ కర్మాటర్ గ్రామం, జాంతారా జిల్లా, జార్ఖండ్ రాష్ట్రం.
స్వాధీనపరచుకున్న వస్తువులు: నగదు ₹21,90,000/- మరియు Rs.1,23,855/- ను అకౌంట్ నందు ఫ్రీజ్ చేయడం జరిగింది. నేరం చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లు-9, ల్యాప్‌టాప్-1, 17-సిమ్, బ్యాంక్ పాస్ బుక్స్-6, డెబిట్ కార్డులు-3, చెక్ బుక్కులు-4 లను స్వాధీనం.
కేసు నమోదు: కావలి టౌన్ పరిధికి చెందిన వ్యక్తికి, RTO ఈ చలానా APK ఫైల్ పంపగా, ఈ చలానా ఏమైనా పెండింగ్ ఉన్నాయోమో అని నొక్కగా, ఫోన్ హ్యాక్ చేసి, అకౌంట్ లోని సుమారు 24 లక్షలు నగదు కోల్పోయినట్లు గ్రహించి, కావలి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసారు.
కేసు చేధన: SPS నెల్లూరు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారి సూచనల మేరకు, కావలి DSP గారి పర్యవేక్షణలో, కావలి 1 టౌన్ CI శ్రీ ఫిరోజ్ గారు మరియు సైబర్ క్రైమ్ CI శ్రీ వెంకటేశ్వర్లు గార్ల ఆద్వర్యములో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, 14.11.2025 న ముద్దాయిలను జార్ఖండ్ లోని జాంతారా జిల్లాలో అరెస్ట్ చేసి, అక్కడ కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ మీద ప్రొడ్యూజ్ చేసి, 18.11.25 న కావలి కోర్టున ప్రొడ్యూజ్ చేసి రిమాండ్ కు పంపడం జరిగింది. పిదప తేది.20.11.25 న సదరు ముద్దాయిలను పోలీసు కస్టడీకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి 21,90,000 నగదు రికవరీ చేసిన అనంతరం ఈ రోజు అనగా 24.11.2025 న సాయంత్రం కోర్టులో ప్రొడ్యూజ్ చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుంది.
జరిగిన వృత్తాంతం: ముద్దాయిలు టెలిగ్రామ్ డెవలపర్ నుండి మాల్వేర్ APK ఫైల్ ని కొనుగోలు చేసి, ఒక ఫోన్ నంబర్ కు APK ఫైల్ పంపి, దానికి క్లిక్ చేసిన తరువాత ఫోన్ నంబర్ ను బ్లాక్ చేసి, అదే ఫోన్ నంబర్ తో E-SIM గా కన్వర్ట్ చేసి, తరువాత UPI యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఫోన్ పే యాక్టివేట్ చేసుకొని, వారు ముందుగా పథకం ప్రకారం సేకరించిన వివిధ అకౌంట్ లకు అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేసి, సదరు అమౌంట్ ను డ్రా చేసుకొని, వారి వద్ద ఉంచుకున్నారు.
సదరు ఫిర్యాదు మేరకు, సాంకేతికత ఆధారంగా ముద్దాయిలను జార్ఖండ్ రాష్ట్రంలో గుర్తించి, చాకచక్యంగా అదుపులోకి తీసుకుని, నగదు రికవరీ చేయడం జరిగింది.
అభినందనలు: ఈ కేసును చేధించుటలో ప్రతిభ కనబరిచిన CI Md ఫిరోజ్, SHO Kavali I Town,
CI A వెంకటేశ్వర్లు, Inspector Cyber Crimes and Social Media Cell,
SI S. సుమన్, Kavali I Town PS,
SI P శ్రీనివాసుల రెడ్డి, Cyber Crime Cell,
మరియు కావలి 1 టౌన్ PS కు చెందిన
HC V. మధు సుధన్, PC P. శ్రీరామ్, PC I. శ్రీహరి, PC M. శివ కుమార్, సైబర్ సెల్ కు చెందిన PC రవీంద్ర లను జిల్లా యస్.పి. గారు అభినందించడం జరిగినది.