భారత్ న్యూస్ హైదరాబాద్….వేధింపులపై సైబరాబాద్ పోలీస్ కఠిన చర్యలు: సీపీ సజ్జనార్ భరోసా….
ఎవరైనా వేధింపులకు గురైతే మౌనంగా భరించవద్దని, పోలీసుల అండ ఎప్పుడూ ఉంటుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. 9490616555 నంబరుకు వాట్సప్ ద్వారా లేదా 100కు డయల్ చేస్తే తక్షణ స్పందన ఉంటుందని ఆయన పేర్కొన్నారు…..
