భారత్ న్యూస్ విశాఖపట్నం..కలెక్టర్… ఎస్పీలను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీపీ కర్రా సుధాకర్…
కృష్ణా జిల్లా కలెక్టర్ డీ కే బాలాజీ తో పాటు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ను అవనిగడ్డ ఆరో కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్( ఎ పి పి)కర్రా సుధాకర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని వారి వారి చాంబర్లలో కలెక్టర్ , ఎస్పీలను కలిసిన సుధాకర్ ను ఇరువురు జిల్లా అధికారులు అభినందించారు .ఈ సందర్భంగా పలు అంశాలు వారి నడుమ చర్చకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు డైరెక్టర్ వేము కోటేశ్వరరావు , కృష్ణాజిల్లా ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కర్రా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
