భారత్ న్యూస్ విజయవాడ…తిరువూరు సర్కిల్ పోలీసుల దాడి – 400 కోడి కత్తుల స్వాధీనం!
ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్. గారి మేరకు, DCP శ్రీ బి. లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, ACP శ్రీ వై. ప్రసాద్ రావు పర్యవేక్షణలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. గిరిబాబు, విస్సన్నపేట ఎస్ఐ శ్రీ జి. రామకృష్ణ, పీఎస్ఐ శ్రీ కె. ఉమామహేశ్వర్ రెడ్డి తదితర సిబ్బంది విస్సన్నపేట గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించి, అక్రమంగా కోడి కత్తులు తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 400 కోడి కత్తులు మరియు తయారీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కోడి పందేలు నిర్వహించడం, కత్తులు తయారు చేయడం లేదా విక్రయించడం చట్ట విరుద్ధం. ఈ తరహా అక్రమ కార్యకలాపాలలో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తప్పవు.