జిల్లా పోలీసు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ:

భారత్ న్యూస్ డిజిటల్:వనపర్తి: తెలంగాణ :

“జిల్లా పోలీసు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ:
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సునిత రెడ్డి, ఐపీఎస్

    ➤ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ

   ➤  శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలి:

    ➤ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు‌ సిబ్బందికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు  జిల్లా ఎస్పీ:

వనపర్తి జనవరి-26: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉదయం 8:00 గంటలకు జిల్లా ఎస్పీ శ్రీమతి
సునిత రెడ్డి, ఐపీఎస్., గారు సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి పోలీసు అధికారులు,.సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.
పోలీసు అధికారులకు సిబ్బందకి, ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు గారు మాట్లాడుతూ… పోలీసుఉద్యోగం రావడం అదృష్టంగా భావించి సక్రమంగా విధులు నిర్వహించి, ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. ప్రజల్లో పోలీసు అధికారులు సిబ్బంది మమేకమై విధులు నిర్వహించినప్పుడే, ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతుందని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశా నిర్దేశం చేశారు, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు విధులు నిర్వహిస్తున్నారు. ఎందరో త్యాగధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి, వారి త్యాగఫలం ద్వారా మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపినారు.
ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం ప్రజలకు నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసి పనిచేసి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత ఉంటుందని తెలిపినారు.
పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమించి ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో వీర జవాన్లు ఉగ్రవాదులు, తీవ్రవాదులు మరియు ఇతర సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వారి ప్రాణాలను త్యాగం చేసినారు.
తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీసు వ్యవస్థగా పేరు పొందినది అన్నారు.
జిల్లాపోలీసు ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి గ్రామ పోలీసు అధికారిని నియమించి పరిష్కరించదగిన చిన్న చిన్న సమస్యలను గుర్తించి గ్రామములోనే ప్రజల సహకారంతో పరిష్కరిస్తున్నామని తెలిపారు.
గంజాయి ఇతర డ్రగ్స్ మత్తు పదార్థాల రహిత జిల్లాగా చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని
అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శాంతి భద్రతలకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఎస్పీ గారు అన్నారు.

ఈ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా సాయుధ దళ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డిఎస్పీ, బాలాజీ, జిల్లా పోలీసుకార్యాలయం ఏఓ, సునందన, వనపర్తి సీఐ, రత్నం,కొత్తకోట సీఐ, రాంబాబు, రిజర్వే ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీస్ అధికారులు సిబ్బంది, పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు సాయుధ పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.