భారత్ న్యూస్ హైదరాబాద్….అత్తాపూర్‌లో హల్దీరాం స్వీట్ హౌస్‌పై కేసు నమోదు
అత్తాపూర్‌లోని హల్దీరాం స్వీట్ హౌస్‌లో కల్తీ, ఫంగస్ పట్టిన మిఠాయిలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లపై ప్రశ్నించిన కస్టమర్ల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై BNS చట్టం కింద పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, నమూనాలను పరీక్షల నిమిత్తం FSLకు పంపించారు.
