తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు!

భారత్ న్యూస్ వరంగల్….తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు!

తెలంగాణ రాష్ట్రానికి కొత్త పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్ డీజీపీగా ఉన్న బి. శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో, 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్ తదుపరి డీజీపీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

UPSC సిఫార్సు చేసిన ముగ్గురు అధికారుల ప్యానెల్‌లో సి.వి. ఆనంద్, వినాయక ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నాయి. సీనియారిటీ, రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం దృష్ట్యా సి.వి. ఆనంద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 14వ తేదీ తర్వాత అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది….