భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తమ్ముడి ప్రేమకు సహకరించాడనే హత్య చేశారు
ఇన్నోవా కారులోనే రాజశేఖర్ హత్య..!
నవాబుపేట అడవి ప్రాంతంలో శవ దహనం
రాజశేఖర్ హత్య కేసులో కీలక ఆధారాల సేకరించిన షాద్ నగర్ పోలీసులు
ఏడు మంది హంతకుల అరెస్ట్ – ఒకరు పరారీ
షాద్ నగర్ పోలీసుల అదుపులో ఇన్నోవా వాహనం
రాజశేఖర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకటేష్ వద్ద “మీడియా ప్రెస్ ఐడి కార్డు”
ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఆరు లీటర్ల పెట్రోల్, నైలాన్ తాడు కొనుగోలు చేసిన హంతకులు

దళిత యువకుడు రాజశేఖర్ కిడ్నాప్ హత్య ఉదాంతంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు కేసులో పురోగతి సాధించారు. రాజశేఖర్ ను హతమార్చి శవాన్ని దహనం చేసిన ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని హంతకులుగా గుర్తించారు. ఇందులో సోమవారం ఏడు మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ లక్ష్మీనారాయణ, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఎర్ర రాజశేఖర్ ను హత్య చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కాగుల వెంకటేష్, మరో ట్రాక్టర్ డ్రైవర్ పత్తి శీను, వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామానికి చెందిన వడ్డే నర్సింలు, బాలనగర్ మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన గణేష్, మొయినాబాద్ మండలం నజీబ్ నగర్ గ్రామానికి చెందిన సోమ సురేష్ అలియాస్ సోమచంద్ కుమార్, రంగంపల్లి గ్రామానికి చెందిన బిజ్జు రాఘవేందర్, మరో డీసెంట్ డ్రైవర్ ఆవుల శ్రీకాంత్, కానుగుల రాములు మొత్తం ఎనిమిది మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఇందులో గణేష్ పరారీలో ఉండగా మిగతా ఏడు మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు సిఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈనెల 12వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో హత్య గురైన రాజశేఖర్ భార్య ఎర్రవాణి వెంకటేష్ అలియాస్ వెంకటయ్య అనే వ్యక్తి మరో ముగ్గురు కలిసి తమ ఇంటి దగ్గరకు వచ్చి తన భర్తను ఇంటి నుండి బయటకు పిలిచి మాట్లాడదామని చెప్పి తనకు సమాచారం ఇవ్వకుండా అతన్ని తీసుకువెళ్లిపోయారని కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు పేర్కొన్నట్లు తెలిపారు. గతంలో తన భర్త సోదరుడు చంద్రశేఖర్ భవాని ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారంలో మొయినాబాద్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయిందని తన మరిది తక్కువ కులం వాడు కావడంతో ఇది చూసి భవాని తండ్రి వెంకటయ్య సిగ్గుపడ్డాడని రాజశేఖర్ చంద్రశేఖర్ కు మద్దతు ఇస్తున్నాడని అతని ఎలాగైనా చంపాలని వెంకటేష్ నిర్ణయించుకున్నాడని తెలిపారు. రాజశేఖర్ ను ఈనెల 12వ తేదీన కిడ్నాప్ చేసి ఇన్నోవా కార్ లో ఎక్కించుకొని అన్నారం జంక్షన్ వైపు వెళ్ళిపోయారు. ఇన్నోవా కారులోనే రాజశేఖర్ గొంతు కోసి చంపారు మెడకు తీసుకువచ్చిన నైలాన్ తాడుతో రెండువైపులాగా ఈ సమయంలో కొందరు అతని కాళ్ళను పట్టుకొని హత్యకు సహకరించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇన్నోవా కారులో రామేశ్వరం వైపు వెళ్లి నవాబుపేట సరిహద్దులకు వెళ్లి ఒక నిర్మానుష ప్రదేశంలో రాజశేఖర్ మృతదేహాన్ని దించి తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ క్యాన్లు 6 లీటర్ల పెట్రోలు మృతదేహం పై పోసి అగ్గిపెట్టతో నిప్పంటించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ఏడు మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు ప్రకటించగా వీరి వద్ద రెండు బైకులు 2 కార్లు అదేవిధంగా 6500 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ ఇన్నోవా కార్ ఆర్ సి వెంకటేష్ కు సంబంధించిన ఒక ప్రెస్ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు శంషాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందని తెలిపారు. షాద్ నగర్ ఎసిపి ఎస్ లక్ష్మీనారాయణ, సీఐ విజయకుమార్, ఎస్ఐ శరత్ కుమార్ పోలీసు సిబ్బంది తదితరులు ఈ కేసులో నిందితుల గుర్తింపు కోసం చురుగ్గా పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు వీరికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తగిన రివార్డులను అందజేస్తారని వారు పేర్కొన్నారు.. **