పై ఫోటోలో ఉన్న ముద్దాయి పేరు బత్తుల ప్రభాకర్ వయసు సుమారు 35 సంవత్సరాలు, ఇతను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి

భారత్ న్యూస్ రాజమండ్రి….పై ఫోటోలో ఉన్న ముద్దాయి పేరు బత్తుల ప్రభాకర్ వయసు సుమారు 35 సంవత్సరాలు, ఇతను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి వాయిదా నిమిత్తం విజయవాడ తీసుకుని వెళ్లి, మరలా తిరిగి రాజమహేంద్రవరం తీసుకువచ్చే క్రమంలో ఈరోజు సాయంత్రం 07:30 గంటల సమయంలో దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం వద్ద పోలీసు వారి నుంచి తప్పించుకుని పారిపోయినాడు.

ముద్దాయి పోలీసు వారి వద్ద నుండి తప్పించుకుని పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నవి మరియు వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడు.

పై ముద్దాయి ఆచూకీ ఎవరికైనా తెలిసినచో ఈ కింది ఫోన్ నెంబర్లకు తెలియజేయవలెను.

ఇన్స్పెక్టర్ దేవరపల్లి- 9440796584.
సబ్ ఇన్స్పెక్టర్ దేవరపల్లి- 94407 96624.

ముద్దాయి ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి తగిన పారిదోషకం ఇవ్వబడును.