భారత్ న్యూస్ విజయవాడ…బళ్లారి వివాదం,ఎస్పీపై సస్పెన్షన్ వేటు
బ్యానర్ల తొలగింపు అంశంపై కర్ణాటక బళ్లారిలో చెలరేగిన వివాదం, రాజశేఖర్ అనే యువకుడి మృతితో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ ఘటనకు బాధ్యుడిగా బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే సస్పెన్షన్ జరగడం చర్చనీయాంశమైంది.

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఘటనలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిపై కేసు నమోదైంది.