అవనిగడ్డ డీఎస్పీ బదిలీ.

భారత్ న్యూస్ విజయవాడ…అవనిగడ్డ డీఎస్పీ బదిలీ

Ammiraju Udaya Shankar.sharma News Editor…అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న డీఎస్పీ విద్యశ్రీ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను గ్రే–1 (G1) విభాగానికి డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన పరిపాలనా మార్పుల నేపథ్యంలో ఈ బదిలీ జరిగింది.

అవనిగడ్డలో విధులు నిర్వహించిన కాలంలో డీఎస్పీ విద్య శ్రీ శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. పలువురు ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారు. ఆమెకు స్థానిక ప్రజలు, అధికారులు అభినందనలు తెలిపారు.