కోతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలపై దాడి – నిందితుడు అరెస్ట్

భారత్ న్యూస్ డిజిటల్ .కరీంనగర్:

కోతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలపై దాడి – నిందితుడు అరెస్ట్

కొతపల్లి శాంతినగర్‌లో సెప్టెంబర్ 21న రాత్రి బతుకమ్మ ఆడుకుంటున్న మహిళలపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు నిందితుడైన షేక్ సజ్జును అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.
సెప్టెంబర్ 21, 2025న రాత్రి 9 గంటల సమయంలో శాంతినగర్‌లోని ప్రైమరీ స్కూల్ గ్రౌండ్‌లో కాలనీకి చెందిన మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన షేక్ సజ్జు అనే వ్యక్తి వారిపై బండరాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో కాసారపు లక్ష్మి, మధు రెడ్డి, ఎల్లమ్మ మరియు మొగిలి అకిరానందులకు గాయాలయ్యాయి.

బాధితురాలు కాసారపు లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు, నిందితుడు షేక్ సజ్జును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. భవిష్యత్తులో ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీ కోతపల్లి గారు హెచ్చరించారు .