భారత్ న్యూస్ గుంటూరు….అపూర్వ సహోదరులు ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు .
ఒకరు హనుమాన్ జంక్షన్ ఎస్సై వి. సురేష్, మరొకరు పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి . సుభాకర్.
వీరిద్దరూ స్వయాన అన్నదమ్ములు .
అన్నదమ్ముల్లో పెద్దవాడైన సీఐ సుభాకర్ గారు 2009 బ్యాచ్ లో ఎస్సై గా సెలెక్ట్ అయి తూర్పుగోదావరి జిల్లా కడియం లో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. ప్రమోషన్ పై కృష్ణ జిల్లా sb CI గా చేసి ప్రస్తుతం పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయన తమ్ముడైన హనుమాన్ జంక్షన్ ఎస్సై వి సురేష్ 2012 బ్యాచ్ Si గా తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి మొదటి పోస్టింగు తీసుకున్నారు .ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఏడాది(2026) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్నదమ్ములు ఒకే వేదిక మీద ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడం విశేషం .వీరిద్దరూ కలిసి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ,జిల్లా కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి గణతంత్ర పురస్కారం అందుకోవడం విశేషం .

ఇద్దరు ఒకే సందర్భంలో ఒకే వేదిక మీద వేర్వేరు హోదాల్లో ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం మంచి అనుభూతి, అభినందనీయం.వారి జీవితాల్లో కూడా ఒక అనుభూతిని, ఆనందాన్ని కలిగించే సందర్భం.
Si v Suresh #CI subhakar #atchutreels #రిపబ్లిక్ #2026#ad Media #fbpost2026