మావోయిస్టులందరూ 7 నెలల్లోగా లొంగిపోవాలని… D.G.P. హరీశ్ కుమార్ గుప్తా

భారత్ న్యూస్ విజయవాడ…మావోయిస్టులందరూ 7 నెలల్లోగా లొంగిపోవాలని… D.G.P. హరీశ్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. విజయవాడలో D.G.P గుప్తా ఎదుట… పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో సీనియర్ మావోయిస్టు దంపతులు నాగరాజు, అరుణ ఉన్నారని… వీరిపై 25 లక్షల రూపాయలు రివార్డ్ ఉన్నట్లు డీజీపీ తెలిపారు. నాగరాజు, అరుణ దంపతులకు తక్షణ ఉపశమనంగా 40 వేల రూపాయలు ఇచ్చామన్నారు. AOB పరిధిలో డంప్ నుంచి పోలీసులు భారీగా ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు లొంగిపోయి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని… డీజీపీ గుప్తా పునరుద్ఘాటించారు.