(తెలంగాణ)
భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….నల్గొండ జిల్లా…
అధిక వడ్డీ కేసులో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్
దేవరకొండ రాష్ట్రంలో సంచలనగా మారిన అధిక వడ్డీ కేసునీ జిల్లా పోలీసులు సీరియస్ గా,తీసుకున్నారు. నల్గొండ జిల్లా పెద్ద చర్లపల్లి మండలం పలుగు తాండ గ్రామానికి చెందిన, రామావత్ బాలాజీ తన అనుచరుల నుండి పెద్ద మొత్తంలో,డబ్బులు తీసుకోవడంతో రంగంలో దిగిన పోలీసులు ఏజెంట్లను అరెస్టు చేస్తూ విచారిస్తున్నారు. మంగళవారం రోజు కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ ఎస్పీ మౌనిక మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. వారి వద్ద నుండి 22 ఎకరాల భూమి డాక్యుమెంట్లను ఒక ఫార్చునర్ కార్ ఐఫోన్ 16 పోలీసులు సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో అభిషేక్ నాయక్ అతని డ్రైవర్ మహేష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులు ఎవరైనా,నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసుకోవాలని ఎస్పీ మౌనిక తెలిపారు. సమావేశంలో ఎస్సై అజ్మీర్ రమేష్, పోలీస్ సిబ్బంది ముత్తిలింగం, హేము, భాస్కర్ నవీన్, రెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5G