చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య

భారత్ న్యూస్ గుంటూరు…చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ సమీపంలో జరిగిన అడ్వకేట్ శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధం మరియు కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఉసర్తి వెంకట కోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఇనుప రాడ్డు, బైక్ మరియు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు హరిప్రసాద్ మార్కాపురం బార్ అసోసియేషన్‌లో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. నిందితుడైన కోటయ్యకు, హరిప్రసాద్ భార్య నాగజ్యోతికి మధ్య ఉన్న అక్రమ సంబంధమే ఈ ఘాతుకానికి దారితీసింది. తన భర్త వేధిస్తున్నాడని నాగజ్యోతి చెప్పడంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని కోటయ్య పథకం వేశాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు శ్రీనివాసరావు సహాయంతో హరిప్రసాద్‌ను నరసరావుపేటకు పిలిపించి, మద్యం సేవించిన అనంతరం యడవల్లి వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఇనుప రాడ్డుతో తలపై కొట్టి అతి దారుణంగా చంపారు. ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంపై స్కూటీని నెట్టి నిందితులు పరారయ్యారు.

ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసును పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, ఎస్ఐ అనిల్ కుమార్ , ఎస్సై లేఖా ప్రియాంక, యడ్లపాడు SI T.శివ రామ కృష్ణ, ASI -శ్రీనివాస రావు, హెడ్ కానిస్టేబుళ్లు వెంకట రావు, సాంబయ్య నాయక్, దేవ రాజు, కానిస్టేబుళ్లు బోసుబాబు, జాని భాష, రత్న కిషోర్, సుబ్బారావు, నాగేశ్వర రావు జిల్లా యస్.పి. అత్యంత చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. సమర్థవంతంగా పనిచేసి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించటం జరిగిందని, అదేవిధంగా డీఎస్పీ కూడా అభినందించి రివార్డ్లకు పంపించడం జరిగిందని తెలిపారు.