లంచం కేసులో.. 90 ఏళ్ల వృద్ధుడికి ఒక్కరోజు జైలు శిక్ష!

భారత్ న్యూస్ ఢిల్లీ…..లంచం కేసులో.. 90 ఏళ్ల వృద్ధుడికి ఒక్కరోజు జైలు శిక్ష!

40ఏళ్ల నాటి లంచం కేసులో 90ఏళ్ల వృద్ధుడికి ఢిల్లీ హైకోర్టు ఒక రోజు జైలు శిక్ష విధించింది.

STCIలో చీఫ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసిన సురేంద్ర కుమార్(90) 1984లో రూ.7,500 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.

19ఏళ్ల తర్వాత అతడికి ట్రయల్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధించింది.

అతడు హైకోర్టులో అప్పీల్‌కి వెళ్లడంతో మరో 22 ఏళ్ల పాటు కేసు పెండింగ్‌లో ఉంది. కేసు విచారణకు 40 ఏళ్లు పట్టడం బాధాకరమని జస్టీస్ తెలిపారు.