(పిజిఆర్ఎస్) పిర్యాదులు స్వీకరణ కార్యక్రమంలో 37 వినతలు స్వీకరణ.

భారత్ న్యూస్ డిజిటల్:శ్రీకాకుళం జిల్లా :

ll (పిజిఆర్ఎస్) పిర్యాదులు స్వీకరణ కార్యక్రమంలో 37 వినతలు స్వీకరణ.ll

శ్రీకాకుళం,డిసెంబరు.22. ప్రజా పిర్యాదులు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలి అని, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో (పిజిఆర్ఎస్) స్వీకరించే పిర్యాదులు పరిష్కారానికి శ్రద్ద వహించి త్వరితగతిన బాధితులకు న్యాయం చేయాలని అదనపు ఎస్పీ (క్రైమ్ ) పి.శ్రీనివాసరావు ఆదేశించారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమంలో అదనపు ఎస్పీ 37 మంది, పిర్యాదు దారులు నుంచి వినతలు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి,ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదు దారుల అర్జీలు,వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే ఫోన్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులకు తెలియ పరిచి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు.వృద్దులు, వికలాంగుల అర్జీ దారులు వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఆయా ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా,తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని అదనపు ఎస్పి పి.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.