భారత్ న్యూస్ డిజిటల్:ఆదిలాబాద్:
“ఎన్నికల చెక్పోస్ట్ నందు 28 లక్షలు స్వాధీనం.
రాంపూర్ ఎస్ఎస్టి తనిఖీల్లో లభ్యమైన నగదు.
సరైన పత్రాలు లేకుండా మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ కు వస్తున్న నగదు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణం శివారు రాంపూర్ నందు ఏర్పాటుచేసిన ఎస్ ఎస్ టి చెక్ పోస్ట్ నందు తనిఖీలలో భాగంగా మహారాష్ట్ర బస్సులో వస్తున్న మహారాష్ట్ర ఉమార్కేడ్, ధానికి గ్రామానికి చెందిన సుభాష్ కేశవ్ జన్నావార్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలుతున్న 28 లక్షల నగదు రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 24 గంటలు అప్రమత్తమై తనిఖీలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో డిప్యూటీ తహసిల్దార్ భూష మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది